Jio Financial Service: ఆటో, హోమ్ లెన్స్, డెబిట్ కార్డులు కూడా జారీ
పూర్తిస్థాయి ఆర్థిక సేవల సంస్థగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మారింది. ఇకపై ఆటో లోన్స్, హోమ్ లోన్స్ ఇవ్వనుంది. అలాగే డెబిట్ కార్డులు కూడా జారీచేస్తామని కంపెనీ చెబుతోంది.
Jio Financial Service: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) (Jio Financial Service) ఇక పూర్తిస్థాయి ఆర్థిక సేవల సంస్థగా మారనుంది. త్వరలో ఆటో, హోమ్ లోన్స్ కూడా ఇవ్వనుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆగస్టులో మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసింది. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్‌ను సోమవారం ప్రకటించింది. ముంబైలో వేతన జీవులకు, స్వయం ఉపాధి చేసేవారికి పర్సనల్ లోన్ ఇస్తుంది. జేఎఫ్ఎస్ గ్రూప్ టెక్నాలజీ అధికారిగా ఏఆర్ గణేశ్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారిగా పనిచేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న 300 రిలయన్స్ స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై కూడా లోన్ ఇస్తోంది. త్వరలో వ్యాపారులకు కూడా లోన్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. జేఎఫ్ఎస్ బ్రోకరేజీ విభాగం 24 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. పేమెంట్ విభాగం సేవింగ్స్ అకౌంట్లను కూడా ఇవ్వనుంది. త్వరలో డెబిట్ కార్డులు ఇవ్వాలని ఆలోచిస్తోంది. బిల్ పేమెంట్ సర్వీస్ రీ లాంచ్ చేసింది. తమ ఉత్పత్తులు కస్టమర్స్ మరింత చేరువయ్యేందుకు యాప్‌ను కూడా జేఎఫ్ఎస్ రెడీ చేస్తోంది.
జేఎఫ్ఎస్ ఫస్ట్ క్వార్టర్ ఫలితాల్లో రూ.668.18 కోట్ల నికర లాభం సాధించింది. జూన్‌లో ఆ లాభం రూ.331.92 కోట్లు మాత్రమే ఉండేది. ఆదాయం రూ.414.13 కోట్ల నుంచి 47 శాతం పెరిగి రూ.608.04 కోట్లకు చేరింది. జేఎఫ్ఎస్ ప్రకటన నేపథ్యంలో మంగళవారం కంపెనీ షేర్లు 3 శాతం లాభ పడ్డాయి.