»Pm Modi Works 14 16 Hrs Daily Industrialist Sajjan Jindal Backs Narayan Murthy 70 Hour Work Week Advice
Sajjan Jindal: యువత రోజుకు 10 గంటలకుపైగా పనిచేయాలి
ప్రధాని మోడీ రోజుకు 14-16 గంటలు పని చేస్తారు, కనీసం యువకులు వారానికి 70 గంటలు వర్క్ చేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ్ మూర్తి వ్యాఖ్యలపై పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ అంగీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.
PM Modi works 14-16 hrs daily Industrialist Sajjan Jindal backs Narayan Murthy 70-hour work week advice
Sajjan Jindal: దేశ ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) రోజుకు 14-16 గంటలు పని చేస్తారని పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్(Sajjan Jindal) పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి(Narayan Murthy) యువతను ఉద్దేశించి వారానికి 70 గంటలు పని చేయాలనే వ్యాఖ్యలను సజ్జన్ శుక్రవారం అంగీకరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి 4 నుంచి 5 రోజులు పనిచేస్తున్నారు. వారిలా మనం కూడా వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తాము అంటే దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుందని పేర్కొన్నారు.
JSW గ్రూప్ చైర్పర్సన్ సజ్జన్ జిందాల్ ప్రధాని రోజుకు 14-16 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ల నాన్న వారానికి 7 రోజులు 12-14 గంటలు పని చేసేవారని…తాను ప్రతిరోజూ 10-12 గంటలు పని చేస్తానని జిందాల్ గతంలో సోషల్ మీడియా ఎక్స్‌లో రాశారు. తాజాగా ఆయన నారాయణ మూర్తి చేసిన వారానికి 70 గంటల పని సూత్రాన్ని హృదయపూర్వకంగా సమర్థిస్తున్నానని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశానికి ఐదు రోజులు పనిచేసే సంస్కృతి అవసరం లేదని అన్నారు. అభివృద్ది చెందిన దేశాల కంటే మన దేశ పరిస్థితులు వేరు అని గుర్తు చేశారు. దేశాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా ఉన్న యువత విశ్రాంతి కంటే పనికే ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడించారు.
3one4 క్యాపిటల్ పాడ్‌కాస్ట్ ‘ది రికార్డ్’ మొదటి ఎపిసోడ్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్‌తో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. చైనా, జపాన్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలంటే భారతదేశం పని ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మనీ, జపాన్ ప్రజలు తమ దేశం కోసం అదనపు గంటలు పనిచేశారని తెలిపారు. భారతదేశంలోని యువకులు సైతం దేశాభివృద్ధి కోసం, మన ఆర్థిక వ్యవస్థ కోసం కష్టపడి పనిచేస్తున్నారని మూర్తి పేర్కొన్నారు.
ఇక మూర్తి మాటలతో Ola CEO భవిష్ అగర్వాల్ ఏకీభవించారు. తక్కువ పని చేసి మనల్ని మనం అలరించుకోవడానికి ఇది సమయం కాదని.. ఇతర దేశాలు ఎన్నో తరాలుగా నిర్మించుకున్న అభివృద్దిని మనం ఈ తరంలో నిర్మించడానికి కంకణ బద్ధులం కావాలని అన్నారు. ఇదే విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ బిలియనీర్ల మాటలతో చాలా మంది ఏకిభవించడం లేదు. కష్టపడి ఎక్కువ సమయం పనిచేస్తే దేశ ఉత్పత్తి పెరగదు.. ఆస్పత్రి బిల్లులు పెరుగుతాయని నెటిజన్లు అంటున్నారు. అలాగే చిత్ర నిర్మాత రోనీ స్క్రూవాలా స్పందిస్తూ.. ఉత్పాదకతను పెంచడం అంటే ఎక్కువ గంటలు పని చేయడం మాత్రమే కాదని పేర్కొన్నారు.