• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

కేజీబీవీలో ఉపాధ్యాయ పోస్టులు

ADB: బేల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో పీజీసీఆర్టీ తెలుగు, పీజీసీఆర్టీ ఇంగ్లిష్, పీజీసీఆర్టీ బాటని పోస్టుల నియామకం కోసం తాత్కాలిక పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. పీజీ, బీఎడ్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ నెల ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 3, 2024 / 02:11 PM IST

అనంతపురం JNTUలో ఆకస్మిక తనిఖీ చేసిన రిజిస్ట్రార్

ATP: అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని పరిపాలన విభాగంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పలు విభాగాలలో కుర్చీలు, బెంచీలు పాడైపోవడంతో వెంటనే మార్చాలని ఆ విభాగాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విధులకు సమయానికి హాజరుకావాలని పలువురు సిబ్బందికి సూచించారు.

December 3, 2024 / 01:00 PM IST

ఘనంగా ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జయంతి

KKD: భారతదేశ ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జయంతి వేడుకలు జగ్గంపేట డీఎన్‌టీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ముఖ్యఅతిథిగా హాజరై బాబు రాజేంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. దేశ రాష్ట్రపతిగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు.

December 3, 2024 / 12:20 PM IST

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

నిన్నటితో పోల్చితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరగటంతో రూ.77,780గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.71,300కు చేరింది. కాగా, వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.99,500గా ఉంది.

December 3, 2024 / 10:30 AM IST

GOOD NEWS: నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్యశాఖలో 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 13వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికార వెబ్ సైట్ http:apmsrb.ap.gov.in/msrb ను సందర్శించండి.

December 3, 2024 / 09:56 AM IST

6న మెగా జాబ్ మేళా

కృష్ణా: మొవ్వ మండంలోని వీఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో జేకేసీ, ఐక్యూఏసీ సంయుక్తంగా ఈ నెల 6వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మాధవి తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

December 3, 2024 / 09:49 AM IST

ఈ నెల 10 నుంచి సెమిస్టర్ పరీక్షలు

SKLM: జిల్లా డా. బీ.ఆర్ ఏయు పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి పలు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ నుంచి ఇంజినీరింగ్ 5వ సెమిస్టర్ పరీక్షలు, 13వ తేదీ నుంచి 7వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు. BPED, DPED 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు.

December 3, 2024 / 09:06 AM IST

సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా ఉపకార వేతనం పొందేందుకు అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి శంకరా చారి ఒక ప్రకటనలో తెలిపారు.  తెలంగాణ ఈ-పాస్ సైట్‌ను ఉపయోగించి ఆన్ లైన్‌లో ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 3, 2024 / 06:24 AM IST

క్యాట్-2024 విద్యార్థులకు ALERT

కామన్ అడ్మిషన్ టెస్ట్-2024కు సంబంధించిన ప్రొవిజనల్ కీ నేడు విడుదల కానుంది. క్యాట్ పరీక్షను ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో నవంబర్ 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 3.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు విడుదల చేసే కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 5 రాత్రి 11:55 వరకు http://iimcat.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని సూచించారు. కాగా ఫలితాలు జనవరిలో విడుదల అయ్యే అవ...

December 3, 2024 / 05:57 AM IST

‘విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలి’

NRML: మైనారిటీలు ముఖ్యమంత్రి విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్ జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి మోహన్ సింగ్ ఒక ప్రకటనలో కోరారు. విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించే మైనారిటీలకు ఈ పథకం ద్వారా రూ. 20 లక్షల ఉపకార వేతనం, విమాన రవాణా ఖర్చు రూ. 40వేలు ఇస్తామన్నారు. డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండి PG, PHD చేయాలనుకునే వారు అర్హులన్నారు.

December 3, 2024 / 05:32 AM IST

నవంబర్‌లో 12 శాతం పెరిగిన మహీంద్రా అమ్మకాలు..!

నవంబర్ నెలకు సంబంధించి మహింద్రా అండ్ మహింద్రా వాహనాల విక్రయాల వివరాలను సంస్థ వెల్లడించింది. నవంబర్ మాసంలో మొత్తం 79,083 వాహనాలను అమ్మినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైన 70,576తో పోలిస్తే 12 శాతం పెరిగినట్లు పేర్కొంది. వీటిలో SUVకి చెందిన 46,222 వాహనాల విక్రయాలు జరిగాయని చెప్పింది.

December 2, 2024 / 10:33 PM IST

సరస్సులో ఉబర్‌ సేవలు.. ఆసియాలోనే తొలిసారి!

జమ్మూకశ్మీర్‌లోని డల్‌ సరస్సులో ఉబర్ తన సేవలను ప్రారంభించింది. పడవ విహారానికి ‘ఉబర్‌ శికారా’ పేరిట ముందస్తు బుకింగ్‌ సేవలను సంస్థ ప్రారంభించింది. జలరవాణాకు సంబంధించి ఇటువంటి సేవలను తమ సంస్థ అందుబాటులోకి తీసుకురావడం ఆసియాలోనే ఇది తొలిసారి అని ఉబర్ వెల్లడించింది.

December 2, 2024 / 08:45 PM IST

CANARA BANK: FDలపై వడ్డీ రేట్లు సవరణ

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సవరించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం FDలపై కొత్త రేట్లు వర్తించనున్నాయి. సవరించిన రేట్లు ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు పేర్కొంది. సాధారణ ఖాతాదారులకు 4-7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4-7.49 శాతం మధ్య వడ్డీ రేట్లు అమలు కానున్నాయి. సాధారణ ఖాతాదారులకు 7-45 రోజుల మధ్య డిపాజిట్లకు 4 శాతం వడ్డీని బ్యాంకు అమలు చేస్...

December 2, 2024 / 08:19 PM IST

PAN 2.Oకి ఎవరు అర్హులు..?

ఇది వరకు ఉన్న పాన్ కార్డు హోల్డర్లందరూ పాన్ 2.0 అప్‌గ్రేడ్ కోసం ఆటోమేటిక్‌గా అర్హులవుతారు. మీకు ఇప్పటికే PAN ఉంటే.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్త పాన్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కొత్త దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు, చిరునామా రుజువులను సమర్పించాలి. పన్ను చెల్లింపుదారులందరికీ PAN 2.0 ఉచితంగా అందించబడుతుంది.

December 2, 2024 / 06:45 PM IST

BREAKING: పరీక్ష తేదీ వచ్చేసింది

IIT, NEET, IIIT వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో BE/BTech కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 మే 18న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. CBT మోడ్‌లో పరీక్ష జరుగనుంది. ఒక అభ్యర్థి రెండేళ్లలో గరిష్ఠంగా రెండుసార్లు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.

December 2, 2024 / 05:05 PM IST