W.G: పోలవరం మండలం చేగొండపల్లికి చెందిన ముచ్చిక రాజబాబు, తెల్లం లక్ష్మి, సరయ్య అనే వారికి చెందిన మూడు గృహాలు ఇటీవల విద్యుత్ ఘాతుకానికి గురై పూర్తిగా దగ్ధమవడం జరిగింది. ఈ క్రమంలో బుధవారం బాధిత కుటుంబాలను నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్&రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పరామర్శించారు. అనంతరం వారికి రూ.5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు.