గతవారం ఐపీవోకు వచ్చిన విశాల్ మెగామార్ట్, మొబిక్విక్ కంపెనీల షేర్లు ఇవాళ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. మంచి ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విశాల్ మెగా మార్ట్ ఇష్యూ ధర రూ.78 కాగా.. రూ.104 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. 33.33% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. మొబిక్విక్ 58.51శాతం ప్రీమియంతో రూ.442.25 వద్ద స్టాక్స్‌లో నమోదయ్యాయి. కాగా.. మొబిక్విక్ ఇష్యూ ధర రూ.279.