AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన కంపెనీ ముందుకు వచ్చింది. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రీజిరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకిన్ ఇండస్ట్రీస్ రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఈ కంపెనీ తన కంప్రెసర్ల తయారీ యూనిట్‌ను శ్రీసిటీలో నిర్మించనుంది. 75ఎకరాల్లో నిర్మించే ఈ కర్మాగారం ఆగ్నేయాసియాలో అతి పెద్దది కానుంది.