ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో జనవరి 8వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకూ చెంది ఉండి 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వుండే యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.