WGL: హసన్‌పర్తి బాలికల జూనియర్ గురుకుల కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కళాశాలలో మత ప్రచారం చేస్తున్నారని కొంతమంది వ్యక్తులు వేడుకలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో ప్రతి సంవత్సరం అన్ని మతాలకు సంబంధించిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఇందుమతి తెలిపారు. ఈ ఘటనలో ఫర్నిచర్ ధ్వంసం అయిందన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి బాంబు బెదిరింపు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ.. ఈ-మెయిల్ పంపినట్లు ముంబైలోని ఆర్బీఐ కార్యాలయం వెల్లడించింది. బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో మెయిల్ వచ్చినట్లు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
PDPL: నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 17న మంగళవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సమీకృత జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

KNL: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో గల మహాత్మ జ్యోతిబాపూలే హై స్కూల్, కళాశాలను ప్రత్యేకంగా సందర్శించారు. నిబంధన ప్రకారం ప్రభుత్వం అందించే ప్రతి పదార్థాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.
తెలంగాణలో విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో LLB, LLM కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ ఆడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్స్ డైరక్టర్ ప్రొ.సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి ఉ.10 నుంచి మధ్యా 12గం వరకు భర్తీ చేస్తారని వెల్లడించారు. ప్రవేశాల్లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా TGలా సెట్-2024TG PGలా సెట్-2024 ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
MDK: చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ టీజీటీ పోస్ట్ ఖాళీగా ఉందని దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ చంద్రకళ ప్రకటనలో కోరారు. హెచ్‌పీటీ అర్హత ఉండి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 16 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 17వ తేదీ డెమో క్లాస్ నిర్వహించబడుతుందని తెలిపారు.
NGL: జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా నమిలిపాఠశాల నుంచి ఇన్స్పైర్ అవార్డ్స్‌కు ముగ్గురు పిల్లలుఎంపికైనట్లు ప్రధానఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక మ్యాన్ హోల్, ఎరువులు లేకుండా కీటకాలను చంపే ఎలక్ట్రోమెష్, ఎల్పీజీ గ్యాస్ లీకేజీని గుర్తించడం, ఎమ్.శ్రీవాణి, ఐ.వైష్ణవి, ఎమ్.శిరీష ఇన్స్పైర్ అవార్డ్సీలో చెప్పారు.
MDK: సమ్మెకు దిగిన కేజీబీవీ బోధన సిబ్బంది స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులను భర్తీ చేసి కేజీబీవీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు అల్పాహారం, భోజనం ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనుంది. ఈనెల 18 మధ్యాహ్నం 3 గంటల నుంచి కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా.. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్‌లకు హాజరుకానున్నారు.
E.G: వృత్తి విద్య (ఒకేషనల్) గ్రూపులకు సంబంధించి ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) నిర్వహిస్తున్న సెంటర్లను జిల్లా ఓజేటీ ఇన్స్ఫెక్షన్ బృందం గురువారం సందర్శించారు. ఎస్ఎన్ఎటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్ఈ, ఈటీ, ఎంఎల్డీ, ఎంపీహెచ్ డబ్ల్యూ (ఫిమేల్) గ్రూపులకు సంబంధించి ఓజేటీ సెంటర్లను క్షుణ్ణంగా పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు.
KDP: పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు.

CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం పేర్కొంది. 10 విభాగాలలో మొత్తం 23 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఇతర 2 https://chittoor.ap.gov.in వెబ్ సెట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 13.