• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ఉద్యోగాల పరీక్ష తేదీ ఖరారు

KMR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇటీవల స్టెనో, టైపిస్ట్ కం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించి అర్హుల జాబితాను వెబ్సైట్‌లో పొందుపరిచామని DLSA కార్యదర్శి నాగరాణి తెలిపారు. శనివారం జరగాల్సిన పరీక్ష అనివార్య కారణాలవల్ల ఈ నెల 21కి వాయిదా వేశామన్నారు. https://kamareddy.dcourts.gov .in/ సంప్రదించాలని సూచించారు.

December 7, 2024 / 11:25 AM IST

విద్యార్థులకు మంత్రి నారాయణ అభినందన

నెల్లూరు నగరం నవాబ్ పేటలోని బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని ప్రసంగించారు. చదువు, క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

December 7, 2024 / 10:01 AM IST

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జాబ్‌కు ఎంపికైతే రూ.85,000 జీతం పొందవచ్చు. మొత్తం 110 పోస్టులు ఉన్నాయి. ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తులకు ఈనెల 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ www.gicre.inను సంప్రదించాలి.

December 7, 2024 / 08:26 AM IST

ఈనెల 10 న జాబ్ మేళా

SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఐటిఐ కాలేజ్‌లో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యు. సాయికుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 120పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC,INTER డిగ్రీ, పూర్తిచేసే 18-35ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులు అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

December 7, 2024 / 08:23 AM IST

అటెండర్ టూ గెజిటెడ్ లెక్చరర్

వికరాబాద్: మర్పల్లి మండలం కలోడ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మొగులప్ప ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో తెలుగు లెక్చరర్‌గా ఎంపికయ్యారు. డైట్ ఎంట్రన్స్ కోచింగ్‌కు డబ్బు లేక అదే ఇన్స్టిట్యూట్లో అటెండర్‌గా పనిచేస్తూ కోచింగ్ తీసుకున్నారు. జూనియర్ లెక్చరర్‌కు ప్రిపేర్ అయి తెలుగు లెక్చరర్‌గా ఎంపికయ్యారు.

December 7, 2024 / 08:06 AM IST

విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. సర్కార్ కీలక ఆదేశాలు

VZM: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లు, KGBVల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి. వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్ఛార్జి రుచి చూడాలి. మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టకూడదు.

December 7, 2024 / 08:05 AM IST

ఉపాధి పని దినాలు పెంచాలి

ASR: ఉపాధి హామీ పనులు రెండు వందల రోజులు పెంచాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. చింతపల్లి మండలం తాజంకి పంచాయతీ వంతమామిడి గ్రామంలో ఉపాధి పనులు పరిశీలించారు. అనంతరం ఆనయ మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పోరాటంతో ఉపాధి హామీ చట్టం వచ్చిందని వేలాది మంది ఉపాధి కూలీలకు వంద రోజులు పని గ్యారంటీ చేస్తూ చట్టబద్ధత కల్పించిందని అన్నారు.

December 7, 2024 / 07:40 AM IST

జాబ్ మేళాతో 23 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు

KRNL: జాబ్ మేళాతో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి లభిస్తుందని ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి ఆనంద్ రాజ్ కుమార్ అన్నారు. ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించగా నవభారత్ ఫర్టిలైజర్స్, అమరరాజా గ్రూప్స్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేయగా, 23 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారని తెలిపారు.

December 7, 2024 / 07:35 AM IST

APSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

W.G: ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తిస్థాయి గ్రాట్యుటీ చెల్లించేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగ సంఘాల వినతి మేరకు గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్‌ను ఎత్తివేసింది. ఇప్పటికే తక్కువ మొత్తం పొందిన రిటైర్డ్ ఉద్యోగులకూ వర్తిస్తుందని తెలిపారు. బకాయిల కోసం వారు వెంటనే డిపోల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

December 7, 2024 / 07:30 AM IST

కొత్తగా కేంద్రీయ విద్యాలయాలు.. ఎక్కడంటే?

దేశంలో కొత్తగా 85 కేంద్రీయ, 28 నవోదయ విద్యాలయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి, మేడ్చల్, MBNR, సంగారెడ్డి, సూర్యాపేట. ఏపీలో చిత్తూరు, అనకాపల్లి, శ్రీసత్యసాయి, గుంటూరు, కృష్ణ, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

December 7, 2024 / 07:20 AM IST

ఈనెల 9న స్పాట్ కౌన్సెలింగ్

GNTR: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (ఆనర్స్) వ్యవసాయం, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో స్పాట్ కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామని వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామచంద్రరావు తెలిపారు. ఈనెల 9న ఉదయం 9.30 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.

December 7, 2024 / 06:29 AM IST

కళాశాలలో ఖాళీ పోస్ట్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

NRML: ముధోల్ గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITDA ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్త ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో భౌతిక శాస్త్రం 01, గణిత శాస్త్రం 01 ఖాళీగా ఉన్నాయని అర్హులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అభ్యర్థులు ఈనెల 7 నుంచి 9 వరకు ఉట్నూరులోని ఆర్సీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 7, 2024 / 04:57 AM IST

5ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కృష్ణా: ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 20లోపు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.

December 7, 2024 / 04:07 AM IST

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతో 81709 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 24677 దగ్గర ముగిసింది.

December 6, 2024 / 03:56 PM IST

చిన్న, సన్నకారు రైతులకు ఆర్‌బీఐ ఊరట

RBI చిన్న, సన్నకారు రైతులకు ఊరట కల్పించింది. రైతులకు తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తాకట్టు చూపించకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. తాజాగా దాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనిపై త్వరలోనే RBI సర్క్యులర్‌ జారీ చేయనుంది. ఈ రుణాలపై పరిమితిని చివరిసారిగా 2019లో రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచారు.

December 6, 2024 / 02:24 PM IST