ఈ వారం పలు కంపెనీలు IPOల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈనెల 19 నుంచి 23 వరకు నాలుగు కంపెనీలు ఐపీవోకు రానున్నాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ధరల శ్రేణి రూ.269-283, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ రూ.665-701, ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెడ్ రూ.410-432, సనాతన్ టెక్స్టైల్స్ రూ.305-321గా కంపెనీలు నిర్ణయించాయి.