SKLM: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ అర్థ సంవత్సర పరీక్షలు ప్రారంభం కాలున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా డీఈవో తవిటినాయుడు ఏర్పాట్లుగా పూర్తి చేసినట్లు తెలిపారు.