SBI టాప్ మేనేజ్మెంట్ ఫేక్ వీడియోలపై బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు Xలో పోస్టు పెట్టింది. ‘బ్యాంక్ మేనేజ్మెంట్ వ్యక్తులంటూ వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలను నమ్మవద్దు. వీడియోలో చెప్పిన పథకాలతో బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదు. అసాధారణ రాబడి వచ్చే పథకాలను SBI ప్రవేశపెట్టదు. ప్రజలు మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొంది.