జమ్మూకశ్మీర్‌లోని డల్ సరస్సులో ఉబర్ తన సేవలను ప్రారంభించింది. పడవ విహారానికి ‘ఉబర్ శికారా’ పేరిట ముందస్తు బుకింగ్ సేవలను సంస్థ ప్రారంభించింది. జలరవాణాకు సంబంధించి ఇటువంటి సేవలను తమ సంస్థ అందుబాటులోకి తీసుకురావడం ఆసియాలోనే ఇది తొలిసారి అని ఉబర్ వెల్లడించింది.
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సవరించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం FDలపై కొత్త రేట్లు వర్తించనున్నాయి. సవరించిన రేట్లు ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు పేర్కొంది. సాధారణ ఖాతాదారులకు 4-7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4-7.49 శాతం మధ్య వడ్డీ రేట్లు అమలు కానున్నాయి. సాధారణ ఖాతాదారులకు 7-45 రోజుల మధ్య డిపాజిట్లకు 4 శాతం వడ్డీని బ్యాంకు అమలు చేస్...
ఇది వరకు ఉన్న పాన్ కార్డు హోల్డర్లందరూ పాన్ 2.0 అప్‌గ్రేడ్ కోసం ఆటోమేటిక్‌గా అర్హులవుతారు. మీకు ఇప్పటికే PAN ఉంటే.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్త పాన్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కొత్త దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు, చిరునామా రుజువులను సమర్పించాలి. పన్ను చెల్లింపుదారులందరికీ PAN 2.0 ఉచితంగా అందించబడుతుంది.
IIT, NEET, IIIT వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో BE/BTech కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే JEE అడ్వాన్స్డ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 మే 18న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. CBT మోడ్‌లో పరీక్ష జరుగనుంది. ఒక అభ్యర్థి రెండేళ్లలో గరిష్ఠంగా రెండుసార్లు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.
ఉభయసభలు నిత్యం వాయిదా పడటంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి చర్చలు లేకుండా వాయిదా పడటంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంభాల్, అజ్మేర్ ఘటనలు, నిరుద్యోగం మొదలైన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయన్నారు. కానీ ప్రభుత్వానికి ఈ అంశాలపై చర్చించటం ఇష్టం లేఖ కావాలనే వాయిదా వే...
PPM: పాలకొండ మండల కేంద్రంలో డిసెంబర్ 10, 11వ తేదీల్లో సీపీఎం పార్టీ జిల్లా మహాసభ కురపాంలో జరుగుతాయని, దీనికి సంబంధించి గోడపత్రికను పాలకొండ మండల కమిటీ కన్వీనర్ ధావాలా రమణారావు సోమవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. మన్యం ప్రాంతంలో అనేక సమస్యలపై పరిష్కారానికి ఉద్యమాలు పోరాటం నిర్వహించాలని, సమస్యలను సమీక్షించుకుని పోరాటం చేస్తానని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను రద్దు చేసింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, ముడి ఉత్పత్తుల గురించి నెలల పాటు చర్చలు జరిపిన అనంతరం ఈ ట్యాక్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రిలయన్స్, ఓఎన్జీసీ వంటి సంస్థలకు ఊరట లభిస్తుంది.
ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన రిటైల్ స్టోర్లను పెంచడానికి రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ నెలఖరులోగా 4 వేల స్టోర్లను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్యను 4 వేలకు పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ‘X’లో ప్రకటన చేశారు. డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లూ ఒకేసారి ప్రారంభించన...
చాలా బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్‌లు EMI పద్ధతిలో లోన్లు ఇస్తున్నాయి. అయితే సులభంగా లోన్ రావాలంటే.. సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రుణ చెల్లింపులో ఆలస్యం చేస్తే చెక్ బౌన్స్‌తో పాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. దీంతో భవిష్యత్తులో తీసుకునే రుణాలపై ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకుంటే.. సిబిల్ స్కోర్ మెరుగ్...
ASR: అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే.పుష్పరాజు అధ్యక్షతన జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కాలుష్య నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. అనంతరం వివిధ రకాల కాలుష్యాల గురించి వివరించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మొదట్లోనే సెన్సెక్స్ భారీగా కుంగిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టంతో 79,732 వద్ద.. నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 24,127 దగ్గర ట్రేడవుతున్నాయి. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 84.58గా ఉంది. ఈ వారంలో RBI ద్రవ్యపరపతి విధాన సమీక్షా నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
W.G: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాలపురంలో అందిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ హబ్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ సూచించారు. సోమవారం నుంచి ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. టెన్త్, ఆపై విద్యార్హతలు కలిగిన 18-35 వయస్సు కలిగి, ఆసక్తిగల వారు స్థానిక మండల పరిషత్ ఆఫీస్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ పథకం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇప్పటికే ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. దాదాపు ఆరు లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వారికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల ద్వారా ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించనున్నారు. ఎంపికైన గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5000 అంది...
SKLM: ఎచ్చెర్లలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్ కేంద్రంలో కొత్తగా ప్రారంభిస్తున్న మూడు నెలల కాల వ్యవధి గల రెండు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఐటీఐ ప్రధానాచార్యులు, జిల్లా కన్వీనర్ ఎల్. సుధాకరరావు తెలిపారు. 18- 30 ఏళ్ల వయసు ఉన్న వారు సోమవారం లోపే దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపారు.
BDK: ఆళ్లపల్లి మండల పరిధిలోని అనంతోగు గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్వీ. బానోత్ సరోజిని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందీ, ఫిజిక్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులు కావాలని చెప్పారు. బీఈడీ, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన విద్యావంతులు అభ్యర్థులు ఈ నెల 2,3 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.