MDK: జిల్లావ్యాప్తంగా 101 పాఠశాలలో జరిగిన జాతీయ అచ్చీవ్ మెంట్ సర్వే పరీక్షలో 2514 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.3వ తరగతిలో 772, 6వ తరగతిలో 741, 9వ తరగతిలో 1001 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు,విద్యాశాఖ,మండల విద్యాధికారులు పరీక్షలను పరిశీలించారు.
SDPT: జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బాల్‌రెడ్డి గత పదేళ్లుగా గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉచితంగా విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు. పాఠశాల సందర్శించిన జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు బాల్‌రెడ్డి సేవలను గుర్తించి శాలువాతో ఘనంగా సన్మానించారు.
UPI లైట్‌కు సంబంధించి RBI కీలక ప్రకటన చేసింది. UPI లైట్ వాలెట్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది. అలాగే, ఒక్కో లావాదేవీ పరిమితిని సైతం రూ. 500 నుంచి రూ.1000 పెంచుతున్నట్లు తెలిపింది. సత్వరమే జరిగే ఈ డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లైట్ పరిమితిని పెంచినట్లు RBI పేర్కొంది. అక్టోబర్‌లో ఎంపీసీ భేటీ సందర్భంగా ఈ ప్రకటన చేసింది.
వంట నూనెల ఇండస్ట్రీలో గోల్డ్ డ్రాప్ సంస్థ ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. సంస్థ తన ఉత్పత్తుల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించినందుకు ఏడోసారి కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్&ట్రేడ్ డెవలప్‌మెంట్(CITD)అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. సంస్థ సేల్స్&మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియాకు CITD అవార్డును ప్రధ...
NGKL: జిల్లా విద్యాధికారిగా రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఆకస్మిక తనిఖీ చేశారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసిన అనంతరం తరగతి గదికి వెళ్లి 10 వ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
NGKL: జిల్లాలోని పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని నాగర్ కర్నూల్ నూతన డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ రిజిస్టర్లను డీఈఓ పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్ల లాభంతో 80,956 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 24,467 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.74గా ఉంది.
HYD: సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన ఉండాలని సికింద్రాబాద్ నార్త్ జోన్ DCP రష్మి పెరుమాళ్ అన్నారు. బుధవారం గోపాలపురం PS ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. సైబర్ క్రైమ్, వ్యక్తిత్వ వికాసం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగం అయిన మెడ్ ప్లస్ మెడికల్ షాప్, హైదరాబాద్ నందు ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 6 న శుక్రవారం ఉదయం 10.00 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ ప్రభుత్వ ఐటీఐ ఖమ్మం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
KMM: ముదిగొండ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పూవాళ్ళ దుర్గాప్రసాద్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, పేద విద్యార్థుల కోసం మెస్ ఛార్జీలను పెంచిందని అన్నారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం BTech మేనేజ్‌మెంట్ కోటా ఫీజులను ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. బీ కేటగిరీ కోటా ఫీజులను కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకు అదనంగా మూడు రెట్లు పెంచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రభుత్వం ముందు ఉంచనున్నట్లు సమాచారం. బీ కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని ప్రభుత్...
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 54వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. త్వరలో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎస్సీ వర్గీకరణ పూర్తైన వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తోంది. వీటిలో ఎక్కువగా టీచర్, గ్రూప్-3 ఉద్యోగాలే ఉన్నట్లు సమాచారం.
ప్రకాశం: డీఈఎస్ఈడీ మొదటి సంవత్సరం సప్లమెంటరీ(2018-20) పరీక్ష ఫలితాలపై ఈనెల 7 లోపు రీకౌంటింగ్ కోసం ఫీజు చెల్లించాలని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. డమ్మీ మార్కుల జాబితాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున సీఎఫ్ఎంఎస్ ద్వారా చలానా తీసి డమ్మీ మార్కుల జాబితాను జతచేసి సెల్ఫ్ అడ్రసు కవర్‌తో నేరుగా అందజేయాలని ఆయన కోరారు.
ప్రకాశం: జిల్లా డీఈఎల్‌ఈడీ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ నవంబరు 2024 నకు సంబంధించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలను WWW.BSE.AP.GOV.IN వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేస్తే సబ్జెక్టునకు రూ.500 లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.