దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 85,358 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 26,048 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.68గా ఉంది.
ప్రస్తుతం మనదేశంలోకి ఏటా 70-80 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తుండగా.. వచ్చే కొన్నేళ్లలో దీన్ని 100 బిలియర్లకు చేర్చాలనుకుంటున్నట్లు పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి అమర్ దీప్ సింగ్ తెలిపారు. ఇందుకు FDI దరఖాస్తుల ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరిస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించేందుకు రక్షణ, రైల్వేలు, బీమా, టెలికాం వంటి రంగాల్లో నిబంధనలను...
NLR: ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) పరీక్షను అక్టోబర్ 3 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని PBR విశ్వోదయ కళాశాల (కావలి), RSR కళాశాల (కడనూతల), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ( నెల్లూరు), అయాన్ డిజిటల్ సెంటర్ (పొట్టేపాలెం)లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు సమయానికి 30నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్నారు.
NLR: గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
VSP: వడ్డాదికి చెందిన యర్రా హేమలత ఫార్మా డీలో గోల్డ్ మెడల్ సాధించింది. రాము, దేవి దంపతుల ప్రథమ కుమార్తె హేమలత కాకినాడలోని ఓ కాలేజీలో ఫార్మా-D కోర్సు పూర్తి చేసింది. కష్టపడి చదివి మంచి మార్కులతో గోల్డ్ మెడల్ సాధించింది. కాలేజీలో 133 మంది విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులకు ఈ అవకాశం కలిగిందని విద్యార్థిని హేమలత తెలిపింది.
AKP: విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకుడు పూడి వెంకట్రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయి. గడిచిన 15 రోజుల్లోనే 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకో పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. మరో 1600 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది.
NLR: ఏపీ టెట్ అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాల, పొట్టేపాళెంలోని ఆయాన్ డిజిటల్ సెంటర్, కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష జరగనుందన్నారు.
సాధారణంగా ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తుంటాయి. ఇప్పుడు అవి కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర అర్ధ సెంచరీ దాటింది. 3 నెలల క్రితం కిలో రూ.20 పలికిన ధర నేడు మూడింతలు పెరిగింది. వరుసగా పండుగలు, శుభకార్యాలు ఉండటంతో.. మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లి వాడకాన్ని తగ్గించుకుంటున్నారు. భారీ వర్షాల వల్ల ఉల్లి సాగు తగ్గడంతో.. ధరలు పెరిగాయని వ్య...
ఆసియా పవర్ ఇండెక్స్ రీజినల్ పవర్‌లో భారత్ సత్తా చాటింది. జపాన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. రానున్న రోజుల్లో చైనాను వెనక్కి నెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనాతో అమెరికా, చైనా, యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఆ సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో.. పవర్ ఇండెక్స్ రే...
ప్రకాశం: ఒంగోలులో యూటీఎఫ్, డీవైఎఫ్ఎ, కనిగిరి టీచర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 29న ఉపాధ్యాయ అర్హతపరీక్ష(టెట్) మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి డి.వీరాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కంభం, దర్శి, పొదిలి, ఒంగోలు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఇది వర్తిస్తుందని తెలిపింది. సాధారణ ఖాతాదారులకు 4 శాతం నుంచి గరిష్ఠంగా 8.60 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 9.10 శాతం మధ్య రాబడిని ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులకు వర్తించనుంది. 6 నెలలకు ఒకరోజు కాలవ్యవధిపై డిపాజిట్లకు 7.25 శాతం వడ...
ELR: డిసెంబరు 8న నిర్వహించనున్న ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు గడువును పెంచినట్లు డీఈవో ఎస్.అబ్రహం తెలిపారు. అక్టోబరు 3వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
AP: జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువును అక్టోబర్ 7వ తేదీకి పెంచారు. అభ్యర్థులు novodaya.gov.inలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాల్లో మార్పులు చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 8, 9వ తేదీల్లో అవకాశం ఉందన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
భారత్‌లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో రూపాయికే ఐఫోన్ అంటూ ఓ సంస్థ ప్రకటన ఇచ్చింది. అయితే ఇలాంటి ప్రకటనలను చూసి, వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ-కామర్స్ వెబ్ సైట్‌లను లాగిన్ చేస్తారని.. అదే సమయంలో సైబర్ నేరస్థులు రెచ్చిపోతారని కేంద్రం దృష్టి పెట్టింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని పలు ...