దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్ మోటార్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా IPO ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. దీంతో ఈ సంస్థ సుమారు రూ.25,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా IPOకు రానుంది. అక్టోబరులోనే ఈ ఐపీఓ ఉండొచ్చని సమాచారం. మొత్తం ఆఫర్ సేల్ పద్ధతిలో 142,194,700 ఈక్విటీ షేర్లను సంస్థ విక్రయించనుంది. ఈ ఇష్యూ కోసం కంపెనీ విలువను 18-20 బిలియన్ డాలర్లుగా పరిగణించను...
ఫ్లిప్‌కార్ట్ ఇటీవల రూ.11కే ఐఫోన్ 13 అంటూ ఓ ఆఫర్ ప్రకటించింది. 22న రాత్రి 11 గంటలకు ఈ డీల్ ఉంటుందని ముందుగానే తెలిపింది. అయితే సంస్థ చెప్పిన సమయానికి ‘బై’ ఆప్షన్ కనిపించకుండానే ‘సోల్డ్ అవుట్’ సందేశాలు కనిపించాయని.. ఇదో పెద్ద స్కామ్, మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. తాము ముందుగా క్లిక్ చేసిన ముగ్గురు...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 255.83 పాయింట్ల లాభంతో 85,169.87 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 63.80 పాయింట్లు పెరిగి 26,004.20 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.60 వద్ద నిలిచింది.
మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన చికెన్ ధరలు ఇవాళ అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.200లకు పైనే ఉంది. తెలంగాణలో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.213 ఉండగా.. ఏపీలో రూ.207 ఉంది. స్కిన్ లెస్ చికెన్ తెలంగాణలో కేజీ ధర రూ.243కు పెరగ్గా.. ఏపీలో 236కు చేరింది.
ఈ మధ్యకాలంలో స్పామ్ కాల్స్, మెసేజ్‌లు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ స్పామ్ డిటెక్షన్ సదుపాయాన్ని తీసుకురానుంది. ఇందుకోసం AI సాయంతో కొత్త టెక్నాలజీని రూపొందించినట్లు ఎయిర్టెల్ CEO గోపాల్ విత్తల్ తెలిపారు. ఇది స్పామ్ కాల్స్, మెసేజ్‌ల గురించి యూజర్లను అలెర్ట్ చేస్తుందని పేర్కొన్నారు. రేపటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 56.19 పాయింట్ల నష్టంతో 84,857.85 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 16.10 పాయింట్లు కుంగి 25,924.30 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.58గా ఉంది.
SRPT: ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గంటల ప్రతిపాదన ఫిజిక్స్ బోధించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్కూల్లో బోధించడానికి ఎంఎస్సీ, బీఈడీ విద్యార్హత ఉన్నవారు సంబంధించిన సర్టిఫికెట్లతో ఈ నెల 26 తేదీలోగా మోడల్ స్కూల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
MDK: అక్కెనపల్లి ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపాదికన బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జానయ్య తెలిపారు. పీజీటీ విభాగంలో జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, పౌర శాస్త్రం, గణితం ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26లోపు పాఠశాలలో ధ్రువపత్రాలను అందజేయాలని సూచించారు.
NLR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయిమెంట్ కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా ఈనెల 27న వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు, ఐటీఐ, డిప్లమో చదివినవారు అర్హులన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్- ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో.. మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు.
TG: రాష్ట్రంలో ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా రంగాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇవాళ CM రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కోర్సులను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 10 వేల మంది విద్య...
TG: హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,360, అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,000 ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.98,000 ఉంది.
VSP: ఈ నెల 26,27 తేదీల్లో విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. మళ్లీ 30వ తేదీన నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.వి. శేషమ్మ తెలిపారు. ఆఫీసు అసిస్టెంట్ (3), రిసెప్షనిస్ట్కమ్ – డేటా ఎంట్రీ ఆపరేటర్ (1) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
TG: MBBS, BDS ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రేపటి నుంచి మొదటి విడత అడ్మిషన్ల వెబ్ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల ప్రాథమిక జాబితాను నిన్న కాళోజీ హెల్త్ వర్సిటీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఇవాళ సా.5లోపు తెలుపాలని వీసీ పేర్కొన్నారు. అభ్యంతరాలు పరిశీలించి రేపు తుది జాబితాను విడుదల చేసి, అదేరోజు వెబ్ ఆప్షన్ల ...
VZM: రెవిన్యూ శాఖలో వివిధ క్యాడర్లకు చెందిన 462 మందిని బదిలీ చేస్తూ విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.మొత్తం 462 పోస్టులకు బదిలీ జరిగింది.బదిలీలు జరిగిన వాటిలో MRO-1, DT -69, సీనియర్ అసిస్టెంట్-50, జూనియర్ అసిస్టెంట్-21, వీఆర్వో గ్రేడ్ I -238, వీఆర్వో గ్రేడ్ II-81, రికార్డ్ ఆసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ ఒక్కొక్క పోస్టు ఉన్నాయన్నారు .