HYD: డా.బీ. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి MBA కోర్సులో చేరడానికి 24 వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తెలంగాణ ఐసెట్ లేదా విశ్వవిద్యాలయం నిర్వహించిన MBA హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ ఎంట్రెన్స్‌లో అర్హత సాధించాలన్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్(RE) ఇప్పుడు ఆన్‌లైన్‌లో బైక్‌లను విక్రయించనుంది. ఈనెల 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, మెటోర్ 350 మోడల్స్ అందుబాటులోకి వస్తాయి. బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, లక్నో, ముంబైలోని కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చు. తగ్గిన GST ప్రయోజనాలతో బైక్స్ లభిస్తాయి. డెలివరీ, ఇతర సేవలను RE డీలర్లు అందిస్తారు.
WGL: ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో 250 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి తెలిపారు. కళాశాలలో ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన 250 మంది అభ్యర్థులకు వివిధ రకాల 16 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు దక్కినట్లు పేర్కొన్నారు.
SKLM: ఉల్లాస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అక్షర ఆంధ్ర” రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం పలాస మండల ఎంపీడీవో కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు మాట్లాడుతూ.. ఉల్లాస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత పెద్దలకు చదువు నేర్పడం ఎలా అనే అంశంపై మెలుకవలు నేర్చుకోవాలన్నారు.
ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి గురువారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 19వ తేదీ శుక్రవారం కళాశాలకు వచ్చి రిపోర్టు చేయాలన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీల్లో చేరేందుకు పలువురు విద్యార్థులు ధరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.
SRCL: ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత మరింత పెరగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్య, రానున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, వివిధ అంశాలపై జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, సోషల్, బీసీ, ట్రైబల్, మైనార్టీ సంక్షేమ కళాశాలలు, టీజీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, కేజీబీవీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో గురువారం కలెక్టర్ సమావేశమయ్యారు.
కృష్ణా: పెదపారుపూడి జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, సోషల్ మీడియా & సైబర్ మోసాలు, డయల్ 112 అత్యవసర కాల్ ప్రాధాన్యత గురించి వివరించారు. పోక్సో చట్టం గురించి విపులంగా వివరిస్తూ.. భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి చట్టాలను గౌరవించాలన్నారు.
SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గురువారం డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నిఖిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతినిత్యం శుభ్రతను పాటించాలని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని తలనొప్పి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
TG: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ECIL)లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. మొత్తం 160 పోస్టులకు గాను బి.టెక్ లేదా బీఈలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.
AP: రేపు జరగనున్న డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కొత్త తేదీలను త్వరలో విడుదల చేస్తామన్నారు. అయితే డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. తర్వాత అభ్యర్థుల పోస్టింగ్ కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గి రూ.1,11,170కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.500 తగ్గి రూ.1,01,900కి పతనమైంది. కాగా, కిలో వెండి ధర రూ.1,41,000గా ఉంది.
TG: RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8 నుంచి 28 వరకు అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ల వరకు, శ్రామిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS కేటగిరీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. డ్రైవర్‌కు 10వ తరగతి, శ్రామిక్ పోస్టులకు ITI పాసై ఉండాలి.
అనంతపురంలోని అలమూరు రోడ్డులో గల ఎన్ఎల్ఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 19న మెగా జాజ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల సీఈవో వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ కంప్యూటర్స్ 2023, 2024 2025 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారిని అర్హులుగా ప్రకటించారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13 ఫోన్ కేవలం రూ. 57,999కి అందుబాటులో ఉండనుంది. SBI క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లభించే డిస్కౌంట్‌తో కలుపుకొని ఈ ధరకు అందించనున్నట్లు వెల్లడించిది. అంతేకాకుండా, వన్‌ప్లస్ 13ఎస్ రూ.47,999కి, నార్డ్ 5 రూ.28,749కి, నార్డ్ 4 రూ.25,499కి అందుబాటులో ఉండనున్నాయి.
కృష్ణా: పెడనలో ఈనెల 20న జాబ్‌మేళా జరగనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్వీనర్ వంగా బాబు ప్రకటించారు. అభ్యర్థులు తప్పనిసరిగా లింక్ ముందస్తు నమోదు చేసుకోవాలని సూచించారు. గూడూరు రోడ్డులోని నాగయ్య జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని తెలిపారు.