ప్రకాశం: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని విద్యుత్ శాఖ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికులకు సమస్యల పట్ల అవగాహన కల్పించేందుకు శనివారం జేఏసీ నేతలు చంద్రశేఖరపురం సబ్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులను రెంగ్యూలర్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామన్నారు.
GST రేట్లను కేంద్రం సవరించిన నేపథ్యంలో హిందుస్థాన్ యూనిలీవర్(HUL) తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఈ మేరకు తగ్గిన ధరలు ఇలా ఉన్నాయి.➢ 340 ML డవ్ షాంపూ బాటిల్ MRP రూ.490 నుంచి రూ.435కి➢ 75 గ్రా. లైఫ్‌బాయ్ సోప్ ధర రూ.68 నుంచి రూ.60కి➢ 200 గ్రా. హార్లిక్స్ జార్ ధర రూ.130 నుంచి రూ.110కి➢ 200 గ్రా. కిసాన్ జామ్ ధర రూ.90 నుంచి రూ.80కి లభించనున్నాయి.
HYD: మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులు దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, స్పాట్ అడ్మిషన్ పొందే విద్యార్థులు ఈనెల 16న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.
నిబంధనలను సరిగ్గా పాటించనందుకు ఫోన్‌పేపై RBI రూ.21 లక్షల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPIs)కు సంబంధించిన నియమాలను ఉల్లంఘించినట్లు RBI తెలిపింది. అక్టోబర్ 2023-డిసెంబర్ 2024 మధ్య ఫోన్‌పే లావాదేవీలను పరిశీలించగా.. ఎస్క్రో ఖాతాలో ఉండాల్సిన బ్యాలెన్స్, బకాయి ఉన్న PPI విలువ కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో RBI ఈ చర్య తీసుకుంది.
సౌర విద్యుత్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి పరిశ్రమల్లో వెండి వాడకం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది. మరోవైపు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితితో పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. భారత్ వెండి దిగుమతులపై ఆధారపడటం, ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఉత్పత్తి ఉండటం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు. భవిష్యత్తులో కూడా వెండి ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
రోజురోజుకు పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ. 1,11,170కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.100 తగ్గి రూ. 1,01,900గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ. 1,43,000కి చేరింది.
SGR: దోస్త్ ద్వారా సంగారెడ్డిలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు ఈనెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అరుణబాయి శుక్రవారం తెలిపారు. ఇంటర్ మెమో, బోనఫైడ్, టీసీ, ఇన్‌కం, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
WGL: నర్సంపేట మండలం మగ్దుంపురంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఇస్కాన్ కూకట్‌పల్లి సహకారంతో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు క్యాన్సర్ నిర్మూలన, నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. వి. జానకి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ యునికార్న్ క్లబ్‌లో 11 కొత్త స్టార్టప్‌లు చేరాయి. దీంతో మొత్తం సంఖ్య 73కి చేరుకుంది. ఈ కొత్త యునికార్న్‌లలో స్టూడియో Ai.tech, నవీ టెక్నాలజీస్, రాపిడో, నెట్‌రాడైన్, డార్విన్‌బాక్స్, జంబోటేల్, వివ్రితి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, మనీవ్యూ, జస్‌పే సహా డ్రూల్స్ ఉన్నాయి. దేశంలో బెంగళూరు 26 యునికార్న్‌లతో అగ్రస్థానంలో నిలిచింది.
కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ పీడీ లాచ్చారావు తెలిపారు. వివిధ సంస్థల ప్రతినిధులు ఈ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. SSC నుంచి ఆపైబడిన విద్యార్హత కలిగి, 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులుగా ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు 15వ తేదీ ఉదయం 9 గంటలకు వికాస కార్యాలయంలో హాజరు కావాలన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 81,758.95 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,548.73) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,992.85 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి.. 355.97 పాయింట్ల లాభంతో 81,904.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.50 పాయింట్ల లాభపడి 25,114 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా కోలుకుని రూ.88.26గా ఉంది.
ASR: అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వసతి గృహాలు, ప్రహరీ గోడ నిర్మించాలని గిరిజన విద్యార్థి సంఘం నేతలు మాధవరావు, కిషోర్, బాబుజీ కోరారు. ఈమేరకు శుక్రవారం పాడేరు ఐటీడీఏలో జరిగిన మీకోసంలో కలెక్టర్ దినేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కళాశాలలో 260 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వసతి గృహాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.
AKP: మాడుగుల మండలం ఎం.కోడూరు జడ్పీ హైస్కూల్ విద్యార్ధులు శుక్రవారం ధూమపానం, మద్యపానం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ.. అవగాహన ర్యాలీ చేశారు. వీటి వల్ల ప్రాణాంతకరమైన కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ధూమ పానం, మద్యపానం వలన కలిగే అనర్ధాలను వివరిస్తూ విద్యార్ధులు నాటికను ప్రదర్శించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 136.63 పాయింట్లు లాభపడి 81,685.36 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46.80 పాయింట్ల లాభంతో 25,052.30 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.44గా ఉంది.
NTR: చల్లపల్లి మండలం పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్లో గురువారం విద్యార్థుల కోసం వండిన అన్నంలో పురుగులు కనిపించాయి. విద్యార్థులు గమనించి హెచ్ఎం కే.బీ.ఎన్ శర్మ దృష్టికి తీసుకువెళ్లడంతో, ఆయన వెంటనే స్పందించారు. బియ్యాన్ని జల్లించి శుభ్రం చేయించి వండించారు. వండిన అన్నం నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.