రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,360 పెరిగి రూ.1,10,290కి చేరుకుంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,250 పెరిగి రూ.1,01,100గా ఉంది. కాగా, కిలో వెండి రూ.1,40,000కి చేరింది.
SRD: జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జ్యోతి సోమవారం తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో 200 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు హాజరు కావచ్చని చెప్పారు.
SRD: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాల బాలికల అండర్-19 ఫుట్ బాల్ పోటీలు ఈనెల 12న మెదక్ ఇందిరాగాంధీ మైదానంలో జరుగుతాయని సంగారెడ్డి జిల్లా ఇంటర్ అధికారి గోవిందరాం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పదోతరగతి మెమో, బోనాపైడ్, జన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 9448686408, 9948321330 సంప్రదించాలని కోరారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 76.54 పాయింట్లు లాభపడి 80,787.30 వద్ద స్థిర పడింది. నిఫ్టీ 32.15 పాయింట్ల లాభంతో 24,773.15 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
TG: రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. తిరిగి అక్టోబర్ 4న పాఠశాలలు తెరుచుకుంటాయి. అదేవిధంగా జూనియర్ కళాశాలలకు ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. తిరిగి అక్టోబర్ 6వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం అవుతాయి.
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి త్వరలో ఛార్జీల భారం పెరగనుంది. పండుగల సీజన్‌కు ముందుగానే జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచాయి. దీనికి అదనంగా ఈ నెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ కూడా విధించనున్నారు. దీంతో వినియోగదారులకు జొమాటో ఆర్డర్లపై రూ.2, స్విగ్గీ ఆర్డర్లపై రూ.2.6 అదనపు భారం పడనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 80,819 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 24,770 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.1865గా ఉంది.
RR: నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ అధికారి జయశ్రీ తెలిపారు. మల్లేపల్లిలోని ఉపాధి కార్యాలయం ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పూర్తి చేసి 18-30 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు.
భారత జాతీయ చెల్లింపుల సంస్థ UPI ద్వారా చేసే కొన్ని రకాల లావాదేవీలకు పరిమితులను గణనీయంగా పెంచింది. ఈ కొత్త మార్పులు సెప్టెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. కొన్ని ప్రత్యేక రకాల P2M లావాదేవీలకు ఒకేసారి రూ.5 లక్షల వరకు.. 24 గంటల వ్యవధిలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది.
ASR: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శనివారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పాడేరులో జిల్లా స్థాయి 5కే మారథాన్ రెడ్ రన్ పరుగు పందేలు నిర్వహించామని జిల్లా కుష్టు, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని ఓంబీ, జాకరవలస ప్రాథమిక పాఠశాలలను రెండవ మండల విద్యాశాఖ అధికారి జీ. గెన్ను శనివారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న బోధన తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సకాలంలో విధి నిర్వహణ చేపట్టి విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్‌పర్సన్ ఎవరు?A) మమతా శర్మB) విజయ కిషోర్ రహత్కర్C) రేఖా శర్మD) లలితా కుమార మంగళం నిన్నటి ప్రశ్నకు జవాబు: 1930NOTE: పోటీ పరీక్షల ప్రత్యేకం
BDK: సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా (జేఎంఈటీ) చేరి వివిధ కారణాలతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి వీలుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ ఆదేశాల మేరకు వారికి మరొక అవకాశాన్ని కల్పించేలా ఉత్తర్వులు శనివారం విడుదల అయ్యాయి.
చిత్తూరు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్, సీడాప్ డీఆర్డీఏ సంయుక్తంగా ఈనెల 10వ తేదీన కార్వేటినగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించబడుతుందని ఐటీఐ ప్రిన్సిపాల్ ఆనంద్ తెలిపారు. మేళాలో 12 కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ ఫెయిల్/పాస్ అయిన 18 నుంచి 35ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు.
TPT: ఎస్వీయూలోని ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మేళాలో ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొని 300 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.