• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ఈనెల 8న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వర్మ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మేధా గ్రూప్ కంపెనీ 300 అప్రెంటిస్ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ ఉత్తీర్ణులై ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన వారు సర్టిఫికెట్లతో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు.

September 6, 2025 / 09:32 AM IST

పాడేరు కాఫీ హౌస్‌లో ‘గురుపూజోత్సవం’

ASR: ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే శక్తి గురువులదేనని కలెక్టర్ దినేష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాడేరు కాఫీ హౌస్‌లో గురుపూజోత్సవం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా విద్యార్థినులు వందేమాతరం, భక్తి గీతాలు ఆలపించారు. ఉపాధ్యాయుడు సమాజ అభివృద్దికి మూల పురుషుడని, సమాజ బాగుకు ఆయుధమన్నారు. ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శమన్నారు.

September 5, 2025 / 05:42 PM IST

Ed.CET వెబ్ ఆప్షన్ తేదీలు పొడిగింపు

HYD: Ed.CET 2025 సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ తేదీలను పొడిగించినట్లుగా HYD ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. నేటి నుంచి వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైందని, సెప్టెంబర్ 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో, 6వ తేదీన ముగియాల్సిన ప్రక్రియను 8వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.

September 5, 2025 / 01:25 PM IST

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు

రోజురోజుకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త తగ్గినా.. ఈ రోజు మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగి రూ. 1,07,620కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 700 పెరిగి రూ. 98,650గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ. 1,000 తగ్గి రూ. 1,36,000కి చేరింది.

September 5, 2025 / 10:11 AM IST

నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

HYD: ఓయూ పరిధిలోని సికింద్రాబాద్ పీజీ కాలేజీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో బోధించుటకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. కాలేజీలోని హిందీ, ఇంగ్లిష్, గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

September 5, 2025 / 07:55 AM IST

JNTUలో పరీక్షలు వాయిదా

HYD: గణేశ్ విగ్రహాల నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 6న JNTUలో జరగాల్సిన ఫార్మ్-డి మొదటి సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 17న జరుగుతాయని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ గురువారం తెలిపారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

September 5, 2025 / 06:03 AM IST

స్పల్పంగా తగ్గిన బంగారం ధరలు

రోజురోజుకు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,06,860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 తగ్గి రూ.97,950 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

September 4, 2025 / 01:02 PM IST

బోధనతో పాటూ సామాజిక బాధ్యత

ASR: రాష్ట్ర స్ధాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా అరకులోయ మండలం, కంఠబౌసుగూడ జీహెచ్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని శెట్టి రోజారాణి ఎంపికయ్యారు. ఈమె 24 ఏళ్లుగా తెలుగు బోధిస్తున్నారు. ఈమె భోధనలో పలువురు విద్యార్థులు తెలుగులో నూటికి నూరు మార్కులు సాధించారు. బడిమానేసిన పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి మరల బడికి వచ్చేలా చేశారు. పేద విద్యార్ధులను దత్తత తీసుకుని చదివించారు.

September 4, 2025 / 12:12 PM IST

జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా సంజీవ్

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంజీవ్‌ను జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయన ప్రతినిత్యం పాఠశాలను మంచి వాతావరణంలో తీర్చిదిద్దడంతోపాటు కల్చరల్, స్పోర్ట్స్ యాక్టీవిటీస్ పరంగా మంచి పేరు తెచ్చారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేసింది.

September 4, 2025 / 10:23 AM IST

ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

KNR: డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డా. వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ఓపెన్ స్కూల్, IIT, డిప్లొమా అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసి రశీదు పొందాలన్నారు. వివరాలకు 7382929755 ఈ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

September 4, 2025 / 09:58 AM IST

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 677.73 పాయింట్ల లాభంతో 81245.44 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 200.95 పాయింట్లు లాభపడి 24916.00 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.03గా ఉంది.

September 4, 2025 / 09:36 AM IST

అవార్డుకు ఎన్నికైన తగరపువలస వాసి

ASR: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య మాజీ అధ్యక్షుడు స్వర్గీయ రాంపాల్ సింగ్ పేరు మీద నెలకొల్పిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తగరపువలసకు చెందిన రెడ్డిపల్లి అప్పలరాజు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ బాంధలోని స్వర్గీయ రాంపాల్ సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ సెలక్షన్ కమిటీ ఫౌండేషన్ ప్రకటించింది.

September 4, 2025 / 08:06 AM IST

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా కడప ఉపాధ్యాయులు

KDP: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని AP ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు అర్హులుగా నిలిచారు. పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె హైస్కూల్‌కు చెందిన హిందీ టీచర్ ఖాదీర్, కాశినాయన మండలం రెడ్డికొటాల MPUPS, SGT బీ.పరిమళ జ్యోతి, ప్రొద్దుటూరు పరిధిలోని లింగారెడ్డిపల్లె MPPS, SGT S.జవహర్ మునీర్‌లు ఎంపికయ్యారు.

September 4, 2025 / 04:33 AM IST

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వీరపనేనిగూడెం ప్రిన్సిపాల్

కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం డాక్టర్ అంబేడ్కర్ గురుకులం ప్రిన్సిపాల్ గ్రేడ్-1 యశోద లక్ష్మి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లభించిన ఈ అవార్డు APSWREIS‌కు ప్రతిష్టతను తీసుకువచ్చింది. తన కృషి, నిబద్ధతతో విద్యార్థుల అభ్యున్నతికి విశేష సేవలందించిన యశోద లక్ష్మికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

September 3, 2025 / 08:48 PM IST

‘మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి’

AKP: నర్సీపట్నం టౌన్ ఎస్సై జీ.ఉమామహేశ్వరరావు పెదబొడ్డేపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్ధులకు బుధవారం మహిళా భద్రత, మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్ధులకు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్ధాల వల్ల జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు.

September 3, 2025 / 06:27 PM IST