రోజురోజుకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త తగ్గినా.. ఈ రోజు మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగి రూ. 1,07,620కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 700 పెరిగి రూ. 98,650గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ. 1,000 తగ్గి రూ. 1,36,000కి చేరింది.