VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీ. ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ, మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. కళాశాల వారీగా జంబ్లింగ్ చేసి నూతన పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగబాకి 84,854 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 25,917 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద ఉంది.
ప్రకాశం: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 28వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు పొందవచ్చని డీఈఓ పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు ఈ విషయాన్ని గమనించి అడ్మిన్ల సంఖ్య పెంచాలని డీఈవో తెలిపారు.
WG: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందేందుకు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని యలమంచిలి ఎంఈవో–2 కనుమూరు వెంకట రామకృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రకాశం: డాన్ బాస్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఒంగోలులోని దాన్ బాస్కో ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రధానాచా ర్యులు రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, బీటెక్, బీ. ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్ధులు ధ్రువ పత్రాలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
VSP: ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ ఇందిరాగాంధీ జూ పార్క్ లో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖడ్గమృగాల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను నిర్వహించినట్లు జూ అధికారులు తెలిపారు.
WG: పెడతాడేపల్లిలోని డాక్టర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ రాజారావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైం ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను ఈ నెల 25 వతేదీ లోపు స్వయంగా అందజేయాలని ప్రిన్సిపల్ రాజారావు పేర్కొన్నారు.
ఐఫోన్ యూజర్లకు కేంద్రం హై రిస్క్ హెచ్చరికలను జారీ చేసింది. IOS, ఐపాడ్, మ్యాక్, వాచ్, విజన్ OSలలో భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. వెంటనే IOS 18, 17.7కు ముందు ఉన్న వెర్షన్లు, ఐపాడ్ OS 18,17.7, మ్యాక్ OS సోనోమాలో 14.7, వెంచురాలో 13.7, సీక్వోయాలో 15, TV OS 18, వాచ్ OS 11, సపారీలో 18, X కోడ్‌లో 16, విజన్ OSలో 2కు ముందు ఉన్న వెర్షన్లను వీలైనంత […]
WG: నరసాపురం మండలం లింగనబోయిన చర్ల బీఆర్ అంబేడ్కర్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చలర్ (గణితం) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎం.రాధాకృష్ణ తెలిపారు. పీజీ, బీఈడీ, టీఈటీ ఆభ్యసించిన అభ్యర్థులు ఆర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 24న కాలేజీలో అందించాలని ప్రిన్సిపాల్ రాధాకృష్ణ కోరారు.
SKLM: ఈనెల 28 వరకు ఓపెన్ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈవో తిరుమల చైతన్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30 వరకు 200 అపరాధ రుసుంతో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలు కొరకు ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని డీఈవో కోరారు.
VZM: రాజాంలో ఈనెల 27వ తేదీన 19 నుంచి 40 ఏళ్లలోపు గల వారికి ఉచిత శిక్షణ కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు NAIRED నిర్వాహకులు తెలిపారు. మహిళలకు హోమ్ నర్సింగ్, మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సులకు, పురుషులకు అకౌంటింగ్ టాలీ, ఎలక్ట్రికల్ వైరింగ్, జెంట్స్ టైలరింగ్ కోర్సులకు 30 రోజులపాటు ఉచిత శిక్షణ, ఉచిత వసతి, భోజన సదుపాయం ఇస్తామన్నారు.
SKLM: ప్రతిభ కలిగిన గ్రూప్స్ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన ఎర్రన్న విద్యాసంకల్పం గత 2 ఏళ్లుగా కొనసాగుతోంది. శ్రీకాకుళంలో ఎర్రన్న విద్యాసంకల్పం గ్రూప్ -2 మెయిన్స్ అభ్యర్థులకు 3వ మాక్ టెస్ట్ ఆదివారం నిర్వహించారు. శ్రీకాకుళం, పలాస, టెక్కలిలో నిర్వహించిన 250 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
E.G: రామచంద్రపురంలోని విఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 24వ తేదీన మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నారు. టెన్త్ నుంచి ఆపైన చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. పలు ప్రైవేటు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
వచ్చే వారం కూడా IPOల సందడి కొనసాగనుంది. 11 IPOలు సబ్‌స్ట్రిప్షన్‌కు రానుండగా.. రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. వాటిల్లో మన్బా ఫైనాన్స్, KRN హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్, WOL 3D ఇండియా, రాపిడ్ వాల్వ్స్, టెక్ ఎరా ఇంజినీరింగ్, యునిలెక్స్ కలర్స్ అండ్ కెమికల్స్, థింకింగ్ హ్యాట్స్ ఎంటర్‌ట్రైన్‌మెంట్ సొల్యూషన్స్, సాజ్ హోటల్స్ IPOకు రానున్నాయి. మరో 14 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛే...
PLD: సత్తెనపల్లి పట్టణంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. జాబ్ మేళాకి అధిక సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.