దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్లు ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ నివేదికలో వెల్లడించింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో 25 ద్వితీయ శ్రేణి నగరాల్లో 65% పెరిగినట్లు చెప్పింది. జైపూర్, ఆగ్రా, గుంటూరు, మంగళూరు, చంఢీగఢ్‌లో భారీగా పెరుగుదల నమోదైందని పేర్కొంది. స్థలం రేటు తక్కువగా ఉండటం, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు మెరుగుపడటం ఇందుకు కారణమని వెల్లడించింది.