వచ్చే వారం రెండు కంపెనీలు IPOకు రానున్నాయి. సాయి లైఫ్ సైన్సెన్స్, విశాల్ మెగామార్ట్ కంపెనీల సబ్స్క్రిప్షన్ డిసెంబరు 11న ప్రారంభమై.. 13న ముగియనున్నాయి. సాయి లైఫ్ సైన్సెన్స్ ఐపీఓ ధరల శ్రేణిని రూ.522-549గా నిర్ణయించగా.. 16న షేర్ల అలాట్మెంట్, 18న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది. రూ.8వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా వస్తున్న విశాల్ మెగామార్ట్ కంపెనీ ధరల శ్రేణి రూ.74-78గా ఉంది.