TPT: చర్లపల్లి నుంచి ధర్మవరానికి ప్రత్యేకరైలు నడుపుతున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆదివారం నుంచి ఈ రైలు రాకపోకలు సాగించనుంది. చర్లపల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లె, కదిరిమీదుగా ధర్మవరం చేరుకుంటుంది.