AP: ఏలూరు జిల్లా వెలగలపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతలపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.