తిరుపతి నగరానికి మరోసారి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వరించింది. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు–2024లో 50వేల నుంచి లక్ష లోపు జనాభా కేటగిరిలో తిరుపతి నగరపాలక సంస్థకు ఈ అవార్డు వచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈనెల 17వ తేదీన ఢిల్లీలోని విద్యా భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా తిరుపతి అధికారులు అవార్డు అందుకోనున్నారు.