సత్యసాయి: పాదయాత్రలో భాగంగా ధర్మవరంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. కుక్కల నియంత్రణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెంటర్లో అందుబాటులో ఉన్న వసతులు, సిబ్బంది గురించి మంత్రి ఆరా తీశారు.