• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ALERT: ఫలితాలు విడుదల

TG: రాష్ట్రంలోని అసిస్టెంట్ ఇంజినీర్ నియామక ఫలితాలు విడుదల అయ్యాయి. ఎలక్ట్రిక్ విభాగంలో 50, మెకానికల్ విభాగంలో 97 మందిని TGPSC సెలెక్ట్ చేసింది. కాగా ఈ ఉద్యోగాల భర్తీకి TGPSC 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు 13,820 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,198 మంది పరీక్ష రాశారు. పోస్టులకు ఎంపికైనా అభ్యర్థులు వివరాలను https://websitenew.tspsc.gov.in/లో చూసుకోవచ్చు.

December 4, 2024 / 05:49 AM IST

విద్యార్థులకు గమనిక.. ఆ తేదీల్లో మార్పు

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ 5 సంవత్సరాల కోర్సెస్(ఏపీఈ, ఐపీసీహెచ్) V, VII, & IXసెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలతో పాటు ఐఎంబీఏ, V సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల తేదీల్లో వర్శిటీ అధికారులు మార్పులు చేశారు. డిసెంబర్ 5 నుంచి16 వరకు జరగాల్సిన పరీక్షలు డిసెంబర్ 17 నుంచి 23 వరకు మార్పు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం.అరుణ పేర్కొన్నారు.

December 4, 2024 / 04:48 AM IST

‘డిసెంబర్ 5 లోపు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి’

W.G: మార్చిలో జరుగు ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులందరూ డిసెంబర్ 5 లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించాలని జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ నరసింహం మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జనరల్, లోకేషనల్ కోర్సుల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

December 4, 2024 / 04:39 AM IST

7న మెగా పీటీఎం నిర్వహించాలి: ఎంఈఓ

KRNL: డీఈఓ శ్యామ్యూల్ పాల్ ఆదేశాల మేరకు పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో ఈ నెల 7న పీటీఎం సమావేశం నిర్వహించాలని ఎంఈఓ-2 రామమూర్తి మంగళవారం తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సూచించారు.

December 4, 2024 / 04:27 AM IST

కస్తూర్బా అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

BHPL: చేర్యాల మండలం కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల జూ. కళాశాలలో ఇంగ్లీష్, నర్సింగ్ బోధించేందుకు అతిథి మహిళా అధ్యాపకుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు  కళాశాల ప్రత్యేక అధికారిణి కృష్ణవేణి తెలిపారు. ఇంగ్లిష్ బోధించుటకు పీజీ, నర్సింగ్ బోధించుటకు బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఈనెల 4 నుంచి 9 వరకు సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలి సూచించారు.

December 4, 2024 / 04:12 AM IST

ఎన్‌సీసీలో సత్తా చాటిన మిట్స్ కళాశాల విద్యార్థిని లాస్య ప్రియ

అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని లాస్య ప్రియ ఎన్‌సీసీలో సత్తా చాటారు. మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్: సీ. యువరాజ్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని దండేలి నందు వాటర్ రాఫ్టింగ్ పోటీలలో తమ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్ లాస్య ప్రియ రాష్ట్రస్థాయిలో విజయం సాధించిందన్నారు. కల్నల్ మోహన్ నాయక్ ప్రశంసా పత్రాన్ని అందజేశారన్నారు.

December 3, 2024 / 04:52 PM IST

EPFO ఖాతాదారులకు గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వం EPFO ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్‌ఓ ఆటో క్లెయిమ్ సదుపాయం పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. ఇందులో ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనులకు అడ్వాన్స్ తీసుకునే వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. దీంతో 27.74 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.15 కోట్ల క్లెయిమ్‌లు ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ పద్ధతి ద్వారా పరి...

December 3, 2024 / 04:48 PM IST

వైకల్యం విజయానికి అడ్డు కాదు: హరినాథ్ రెడ్డి

అన్నమయ్య: వైకల్యం అనేది విజయానికి అడ్డు రాదని, పట్టుదల ఉంటే ఎటువంటి విజయాన్ని అయినా సాధించవచ్చునని దివ్యాంగ ఉపాధ్యాయుడు ఎన్. హరినాథ్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆయన మంగళవారం పాఠశాలలో ప్రపంచ దివ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు శుబతిధి భోజనం అందజేశారు.

December 3, 2024 / 03:58 PM IST

సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాని హాస్టల్ పనులు

KDP: బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని రెండు బాలికల హాస్టల్‌కు గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.15 లక్షల నిధులు మరమ్మతులకు అప్రూవల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న హాస్టల్లో పనులు మాత్రం జరగడం లేదు. బాలికల గదులల్లోకి కిటికీల ద్వారా కోతులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

December 3, 2024 / 03:25 PM IST

పుంగనూరులో టీచర్లకు తరల్ పై శిక్షణ

CTR: పుంగనూరు బసవరాజా ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ అట్ రైట్ లెవెల్ (తరల్) శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించడం, ఆకర్షణీయమైన పద్ధతితో బోధన, గుణాత్మక విద్య అందించుట ఇలా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు MEO చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

December 3, 2024 / 02:59 PM IST

కేజీబీవీలో ఉపాధ్యాయ పోస్టులు

ADB: బేల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో పీజీసీఆర్టీ తెలుగు, పీజీసీఆర్టీ ఇంగ్లిష్, పీజీసీఆర్టీ బాటని పోస్టుల నియామకం కోసం తాత్కాలిక పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. పీజీ, బీఎడ్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ నెల ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 3, 2024 / 02:11 PM IST

అనంతపురం JNTUలో ఆకస్మిక తనిఖీ చేసిన రిజిస్ట్రార్

ATP: అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని పరిపాలన విభాగంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పలు విభాగాలలో కుర్చీలు, బెంచీలు పాడైపోవడంతో వెంటనే మార్చాలని ఆ విభాగాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విధులకు సమయానికి హాజరుకావాలని పలువురు సిబ్బందికి సూచించారు.

December 3, 2024 / 01:00 PM IST

ఘనంగా ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జయంతి

KKD: భారతదేశ ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జయంతి వేడుకలు జగ్గంపేట డీఎన్‌టీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ముఖ్యఅతిథిగా హాజరై బాబు రాజేంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. దేశ రాష్ట్రపతిగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు.

December 3, 2024 / 12:20 PM IST

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

నిన్నటితో పోల్చితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరగటంతో రూ.77,780గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.71,300కు చేరింది. కాగా, వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.99,500గా ఉంది.

December 3, 2024 / 10:30 AM IST

GOOD NEWS: నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్యశాఖలో 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 13వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికార వెబ్ సైట్ http:apmsrb.ap.gov.in/msrb ను సందర్శించండి.

December 3, 2024 / 09:56 AM IST