TG: గ్రూప్-2 పరీక్షలపై TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితాను https://www.tspsc.gov.in/ లో పొందుపర్చింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్టికెట్లు డౌన్లోడ్ సమయంలో సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185, 040-23542187 నంబర్లకు సంప్రదించవచ్చు.