AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనుంది. ఈనెల 18 మధ్యాహ్నం 3 గంటల నుంచి కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా.. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్‌లకు హాజరుకానున్నారు.