వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పలు సంస్థల్లో నియామకాలు పెరగనున్నట్లు మానవ వనరుల సేవల సంస్థ నివేదిక వెల్లడించింది. ఉద్యోగుల నియామకంపై కంపెనీలు సానుకూలంగా ఉన్నాయని.. అయితే ఈ కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలోనే ఎక్కువ ఉండనున్నట్లు చెప్పింది. దాదాపు 53% సంస్థలు రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్లు తెలిపింది. దేశంలోని 3వేలకు పైగా వ్యాపార సంస్థల సమాచారం సేకరించి ఈ నివేదిక రూపొందించినట్లు పేర్కొంది.