వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై మెటా స్పందించింది. సాంకేతిక సమస్యతో తమ యాప్స్‌ను పలువురు యూజర్లు వినియోగించుకోలేకపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరగా సేవలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భగా తమ సేవల్లో అంతరాయం నెలకొన్నందుకు యూజర్లకు క్షమాపణలను చెప్పింది.