వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్ సేవల్లో అంతరాయం కలుగుతున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ మెసేజ్లు వెళ్లడం లేదని, లాగిన్ అవ్వడం లేదని వేలాది మంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. 50వేల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లు, 23వేల మందికి పైగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.