ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోట తన కొత్త తరం సెడాన్ కామ్రీని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.48 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కారు లీటరుకు 25 కి.మీ మైలేజీ, 18 అంగుళాల అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, స్లిమ్ LED ల్యాంప్స్, డైటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ఫ్యూచర్లతో వస్తుంది.