PLD: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల సభ్యులు అన్నారు. గురువారం హరితోత్సవం సందర్భంగా ఎస్కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థులు చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.