తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం జియో ‘న్యూఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025’ను తీసుకొచ్చింది. రూ.2025తో రిఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడితో రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత 5జీ డేటా, వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను వినియోగించుకోవచ్చు. అదనంగా రూ.2150 విలువైన కూపన్లు( రూ.500 ఏజియో, స్విగ్గీలో రూ.150, ఈజ్ మై ట్రిప్లో రూ.1500) పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.