అనిల్ అంబానీకి చెందిన ప్రముఖ రిలయన్స్ పవర్ ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. విద్యుత్‌కు సంబంధించి ‘రిలయన్స్ న్యూ ఎనర్జీస్’ అనే పేరుతో ఈ సంస్థను ప్రారంభించింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం మొదలైన సొల్యూషన్స్‌పై సంస్థ దృష్టి పెడుతోంది. దీనికి సీఈవోగా మయాంక్ బన్సల్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా రాకేశ్ స్వరూప్‌లను నియమించింది.