అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో మొట్టమొదటిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరి చరిత్రకెక్కాడు. ఇటీవల స్పేస్‌ఎక్స్‌లోని కొంత వాటాను మస్క్ విక్రయించాడు. దీంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరిగి.. 439.2 బిలియన్ డాలర్లకు చేరకుంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ తెలిపింది.