BOB అనుబంధ బీఓబీ కార్డ్ లిమిటెడ్ మహిళల కోసం కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. తియారా పేరిట లాంఛ్ చేసిన ఈ కార్డు ద్వారా ట్రావెల్, డైనింగ్, లైఫ్‌స్టైల్‌కి సంబంధించి పలు ప్రయోజనాలు అందించనుంది. ఈ కార్డు కోసం జాయినింగ్ ఫీజు రూ.2,499+ GST చెల్లించాలి. కార్డు తీసుకున్న 60 రోజుల్లో రూ.25 వేల వరకు లావాదేవీలు జరిపితే జాయినింగ్ ఫీజుని తిరిగిస్తారు. ఏడాదిలో రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుముని రద్దవుతుంది.