రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి బాంబు బెదిరింపు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ.. ఈ-మెయిల్ పంపినట్లు ముంబైలోని ఆర్బీఐ కార్యాలయం వెల్లడించింది. బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో మెయిల్ వచ్చినట్లు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.