కేంద్ర ప్రభుత్వం EPFO ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్‌ఓ ఆటో క్లెయిమ్ సదుపాయం పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. ఇందులో ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనులకు అడ్వాన్స్ తీసుకునే వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. దీంతో 27.74 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.15 కోట్ల క్లెయిమ్‌లు ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ పద్ధతి ద్వారా పరి...
అన్నమయ్య: వైకల్యం అనేది విజయానికి అడ్డు రాదని, పట్టుదల ఉంటే ఎటువంటి విజయాన్ని అయినా సాధించవచ్చునని దివ్యాంగ ఉపాధ్యాయుడు ఎన్. హరినాథ్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆయన మంగళవారం పాఠశాలలో ప్రపంచ దివ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు శుబతిధి భోజనం అందజేశారు.
KDP: బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని రెండు బాలికల హాస్టల్‌కు గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.15 లక్షల నిధులు మరమ్మతులకు అప్రూవల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న హాస్టల్లో పనులు మాత్రం జరగడం లేదు. బాలికల గదులల్లోకి కిటికీల ద్వారా కోతులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
CTR: పుంగనూరు బసవరాజా ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ అట్ రైట్ లెవెల్ (తరల్) శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించడం, ఆకర్షణీయమైన పద్ధతితో బోధన, గుణాత్మక విద్య అందించుట ఇలా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు MEO చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ADB: బేల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో పీజీసీఆర్టీ తెలుగు, పీజీసీఆర్టీ ఇంగ్లిష్, పీజీసీఆర్టీ బాటని పోస్టుల నియామకం కోసం తాత్కాలిక పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. పీజీ, బీఎడ్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ నెల ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ATP: అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని పరిపాలన విభాగంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పలు విభాగాలలో కుర్చీలు, బెంచీలు పాడైపోవడంతో వెంటనే మార్చాలని ఆ విభాగాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విధులకు సమయానికి హాజరుకావాలని పలువురు సిబ్బందికి సూచించారు.
KKD: భారతదేశ ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జయంతి వేడుకలు జగ్గంపేట డీఎన్‌టీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ముఖ్యఅతిథిగా హాజరై బాబు రాజేంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. దేశ రాష్ట్రపతిగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
నిన్నటితో పోల్చితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరగటంతో రూ.77,780గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.71,300కు చేరింది. కాగా, వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.99,500గా ఉంది.
AP: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్యశాఖలో 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 13వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికార వెబ్ సైట్ http:apmsrb.ap.gov.in/msrb ను సందర్శించండి.
కృష్ణా: మొవ్వ మండంలోని వీఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో జేకేసీ, ఐక్యూఏసీ సంయుక్తంగా ఈ నెల 6వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మాధవి తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
SKLM: జిల్లా డా. బీ.ఆర్ ఏయు పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి పలు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ నుంచి ఇంజినీరింగ్ 5వ సెమిస్టర్ పరీక్షలు, 13వ తేదీ నుంచి 7వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు. BPED, DPED 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు.
MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా ఉపకార వేతనం పొందేందుకు అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి శంకరా చారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఈ-పాస్ సైట్‌ను ఉపయోగించి ఆన్ లైన్‌లో ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కామన్ అడ్మిషన్ టెస్ట్-2024కు సంబంధించిన ప్రొవిజనల్ కీ నేడు విడుదల కానుంది. క్యాట్ పరీక్షను ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో నవంబర్ 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 3.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు విడుదల చేసే కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 5 రాత్రి 11:55 వరకు http://iimcat.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని సూచించారు. కాగా ఫలితాలు జనవరిలో విడుదల అయ్యే అవ...
NRML: మైనారిటీలు ముఖ్యమంత్రి విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్ జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి మోహన్ సింగ్ ఒక ప్రకటనలో కోరారు. విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించే మైనారిటీలకు ఈ పథకం ద్వారా రూ. 20 లక్షల ఉపకార వేతనం, విమాన రవాణా ఖర్చు రూ. 40వేలు ఇస్తామన్నారు. డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండి PG, PHD చేయాలనుకునే వారు అర్హులన్నారు.
నవంబర్ నెలకు సంబంధించి మహింద్రా అండ్ మహింద్రా వాహనాల విక్రయాల వివరాలను సంస్థ వెల్లడించింది. నవంబర్ మాసంలో మొత్తం 79,083 వాహనాలను అమ్మినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైన 70,576తో పోలిస్తే 12 శాతం పెరిగినట్లు పేర్కొంది. వీటిలో SUVకి చెందిన 46,222 వాహనాల విక్రయాలు జరిగాయని చెప్పింది.