NZB: వైద్య, ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్యమిషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 4 ఇంజినీర్ ఉద్యాగాలను భర్తీ చేయనున్నట్లు DMHO డా.రాజశ్రీ తెలిపారు. అభ్యర్థులు B.Tech (CSE/IT/ECE) అర్హత, కనీసం 4 సంవత్సరాల టెక్నికల్ అనుభవం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 16 నుంచి 23 సాయంత్రం 5 గంటలలోపు DMHO కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు.