TG: రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు గ్రూప్-2 పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే నాగర్కర్నూల్ జెడ్పీ హైస్కూల్లో పరీక్ష రాస్తున్న ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అయినా అభ్యర్థి రేవతి పురిటి నొప్పులతోనే పరీక్ష రాస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు రేవతికి వైద్యం కోసం వైద్య సిబ్బంది, అంబులెన్స్ సిద్ధం చేశారు.