మెదక్: గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిలో హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి, తమ సమస్యలను తెలుపవచ్చునని పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.