JN: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్2 పరీక్షకు మెుండ్రాయి పరిధిలోని ఓ తండాకు చెందిన భూక్య సునీత పొరపాటు కారణంగా పరీక్ష రాయలేకపోయింది. ఒకపాఠశాలకు బదులు మరొక పాఠశాలకు వెళ్లింది. ఆమెకు ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత.. తన పరీక్ష కేంద్రం కాదని బయటకు పంపించారు. వెంటనే తన పరీక్ష కేంద్రానికి వెళ్లగా అప్పటికే గేట్లను మూసేశారు. సిబ్బందిని ప్రాధేయపడినా అనుమతించపొవడంతో సునీత విలపిస్తూ తిరిగి వెళ్లింది.