దేశీయ మార్కెట్లో ఐపీవోల సందడి కొనసాగుతోంది. ఈ వారం ఐదు కంపెనీలు IPOకు రానున్నాయి. ప్రధాన విభాగంలో ట్రాన్స్రైల్ లైటింగ్, DAM క్యాపిటల్ అడ్వైజర్స్, మమత మెషినరీ, సనాతన్ టెక్స్టైల్ IPOలు ఉన్నాయి. వీటి సబ్స్క్రిప్షన్ ఈనెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. మరో కంపెనీ వెంటివ్ హాస్పిటాలిటీ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగుస్తుంది. మరోవైపు స్టాక్ మార్కెట్లో 12 కంపెనీల షేర్లు నమోదు కానున్నాయి.