ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగింది. వచ్చే ఏడాది కూడా ఈ జోరు కనిపించనుంది. 2025లో IPOకి వచ్చేందుకు 89 కంపెనీలు ప్రణాళిలు చేస్తున్నాయి. ఈ మేరకు సెబీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీలు మొత్తంగా రూ.1.5 లక్షల కోట్ల వరకు సమీకరించనున్నాయి. IPOకి రానున్న ప్రముఖ కంపెనీల్లో LG ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, NSDL, JSW సిమెంట్, హీరో ఫిన్‌కార్ప్, ఏథర్ ఎనర్జీ వంటివి ఉన్నాయి.