TG: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, ఈ పరీక్షలకు రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపనట్లుగా కనిపిస్తోంది. ఇవాళ మొదటి రోజు పరీక్షలు జరగగా.. హాజరుశాతం భారీగా తగ్గింది. సగానికిపైగా అభ్యర్థులు హాజరుకాలేదు. పేపర్-1కు 46.75 శాతం అభ్యర్థులు హాజరు కాగా.. పేపర్-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.