WGL: జిల్లాలో గ్రూప్-2 పరీక్ష మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలు వరంగల్ కలెక్టర్ సత్యశారద వెల్లడించారు. జిల్లాలో మొదటి పేపర్ పరీక్షకు 11,310 మంది అభ్యర్థులకు 5, 275 మందితో 46.64 హాజరుశాతం నమోదైంది. 6,035 మంది గైర్హాజరయ్యారు. రెండో పేపరు 5, 245 మందితో 46.37 హాజరుశాతం నమోదైంది. 6,065 మంది గైర్హాజరైనట్లు ఆమె వెల్లడించారు.